సెన్సేషనల్ రెస్పాన్స్ తో ‘పెద్ది’ ట్రైలర్!

సెన్సేషనల్ రెస్పాన్స్ తో ‘పెద్ది’ ట్రైలర్!

Published on May 19, 2026 10:00 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. భారీ అంచనాలు ఉన్న ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా నుంచి అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ ఇప్పుడు రానే వచ్చింది. బుచ్చిబాబు సానా టేకింగ్ అలానే రామ్ చరణ్ పెర్ఫామెన్స్ లతో మంచి ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ ఇపుడు యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

ఇంకా 24 గంటలు కూడా పూర్తి కాకుండానే అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ ఇపుడు ఏకంగా 63 మిలియన్ వ్యూస్ ని దాటి దూసుకెళ్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఇందులో తెలుగు, హిందీ ట్రైలర్ లకి సమానమైన రెస్పాన్స్ నమోదు కావడం విశేషం. దీనితో పెద్ది ట్రైలర్ కూడా సూపర్ హిట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ రెహమాన్ సంగీతం అందిస్తుండగా జాన్వీ కపూర్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ జూన్ 4న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

తాజా వార్తలు