వైరల్ వీడియో : గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోకి రామ్ చరణ్ పవర్ఫుల్ ఎంట్రీ

Published on Feb 23, 2023 6:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటించిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ విజయంతో మంచి జోరుమీదున్నారు చరణ్. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా వందల కోట్ల కలెక్షన్ ని అలానే ఎన్నో దేశాల ఆడియన్స్ యొక్క మెప్పుని అందుకుంది. అవి మాత్రమే కాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులని సైతం కైవశం చేసుకుంటోంది.

ఇక త్వరలో జరుగనున్న ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఇప్పటికే అమెరికా చేరుకున్న చరణ్, నేడు అక్కడి ఫేమస్ గుడ్ మార్నింగ్ అమెరికా షో లో పాల్గొన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఈ షోలో పాల్గొనేందుకు వచ్చిన చరణ్ ని చూసేందుకు ఎందరో ఫ్యాన్స్ అక్కడికి తరలివచ్చారు. ఇక షోలోకి రామ్ చరణ్ పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన వీడియో కొద్దిసేపటి క్రితం విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియా లో విరివిగా వైరల్ అవుతోంది. మొత్తంగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ గొప్ప ఘన విజయంతో హీరోలుగా ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కూడా గ్లోబల్ గా భారీ క్రేజ్ అందుకోవడం విశేషం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :