రామ్ చరణ్, సుకుమార్ ల చిత్రం ‘రంగస్థలం’ ఇంకో రెండు రోజుల్లో విడుదలకానుంది. ఈ సినిమాలో చరణ్ సరసన సమంత కథానాయకిగా నటించారు. ఇన్నాళ్లు స్టైలిష్, గ్లామర్ పాత్రల్లో మాత్రమే కనిపించిన ఆమె ఈ చిత్రంలో మాత్రం గ్రామీణ యువతిగా రఫ్ లుక్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటల ప్రోమోలు, ట్రైలర్లో ఆమె పెర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు సినిమాలో సమంత నటన పై చాలా హోప్స్ పెట్టేసుకున్నారు.
సమంత కూడ ఆ అంచనాలను అందుకునేలా పెర్ఫార్మ్ చేశారని చరణ్ అంటున్నారు. ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలు చేసిన సమంత, పల్లెటూరి వాతావరణం అంటే ఏమిటో కొంచెం కూడ అవగాహన లేని సమంత సినిమాలో మాత్రం గ్రామీణ యువతిగా టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, ఆమెను చూసి తాను కూడ ఇన్స్పిరేషన్ పొంది, ఆమె కన్నా బాగా చేయాలని అనుకునేవాణ్ణని అన్నారు.
అలాగే సమంత సహా నటిగా ఉంటే ఏ హీరో నటనలో అయినా కొంత భిన్నత్వం, కొత్తదనం కనిపిస్తుందని, అందుకు ఆమె నటనే కారణమని అన్నారు. మరి చరణ్ ఇంతలా చెబుతున్న సమంత పెర్ఫార్మెన్స్ ఏ స్టాయిలో ఉంటుందో చూడాలంటే 30వ తేదీ వరకు ఆగాల్సిందే.
