ఏపీ సీఎం జగన్ కు థాంక్స్ చెప్తున్న రామ్ చరణ్.!

ఏపీ సీఎం జగన్ కు థాంక్స్ చెప్తున్న రామ్ చరణ్.!

Published on Dec 19, 2020 4:02 PM IST

Ram Charan 1

ఈ ఏడాది ఊహించని విధంగా వచ్చిన కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే కరోనా దెబ్బ నుంచి అన్ని రంగాలు కూడా తిరిగి కోలుకుంటున్నాయ్ కానీ సినీ రంగం మాత్రం ఇంకా ఆరంభ దశలోనే ఉంది.

మరి ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నిమిత్తం తెలుగు సినీ ప్రముఖులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిటర్లకు గాను ఏపీ ప్రభుత్వం సినిమాస్ రీస్టార్ట్ ప్యాకేజీ కింద చేయూతను అందివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

మరి అదే విధంగా ఇప్పుడు మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఏపీ ప్రభుత్వానికి మరియు జగన్ కు తన హార్దిక ధన్యవాదాలు తెలిపారు. వారు అందించిన ఈ సహాయం సినీ పరిశ్రమకు చాలా ఊరటను ఇస్తుంది అని చరణ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపి వారికి థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు