భార్య ఉపాసనకి ప్రేమతో చరణ్ స్పెషల్ విషెష్.!

Published on Jul 20, 2021 11:00 am IST

మన టాలీవుడ్ స్టార్ హీరోలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. మెగాస్టార్ వారసుడిగా పరిచయం అయ్యి మెగా లెగసిని తీసుకెళ్తున్న చరణ్ కి తగ్గ భార్యగా మెగాస్టార్ చిరంజీవికి తగిన కోడలిగా ఉపాసన కొణిదెల పుట్టినరోజు నేడు కావడంతో మెగా అభిమానులు తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే చిరు మరియు చరణ్ లు ఎంతటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారో లేదనకుండా అందించిన సహాయాలు ఎన్నో ఉన్నాయి. మరి అదే బాటలో ఉపాసన కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అందుకే ఆమె అంటే తెలుగు ఆడియెన్స్ లో ఒక రకమైన గౌరవం నెలకొంది. మరి ఈరోజు తన భార్య పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో తన ప్రేమను ప్రత్యేకంగా చరణ్ వ్యక్తపరిచాడు.

“అవసరంలో ఉన్న ప్రజలకు కానీ నీ కుటుంబానికి కానీ నీ బెస్ట్ ఉవ్వడంలో ఎప్పుడూ నువ్వు వెనకడుగు వెయ్యలేదు, నీకు థాంక్స్ చెప్పడానికి ఏ గిఫ్ట్ కూడా సరిపోదు, హ్యాపీ బర్త్ డే” అంటూ తన ప్రేమను ఇలా అద్భుతమైన పదాల్లో వ్యక్తపరిచాడు. దీనితో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :