
‘బ్రూస్ లీ’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాలపైన దృష్టి సారించాడు. అందులో ఒకటి తను నటించబోయే ‘తని ఒరువన్’ రీమేక్ అయితే, రెండవది తను నిర్మించబోయే చిరు 150వ సినిమా. చిరు సినిమా కూడా తమిళంలో హిట్ అయిన కత్తి సినిమాకి రీమేక్. ఈ రెండు రీమేక్స్ కావడం వలన కథల మార్పులు చేర్పులు విషయంలో చరణ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ‘తని ఒరువన్’ రీమేక్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నాడు.
చరణ్ సురేందర్ రెడ్డి అండ్ టీం కి స్ట్రిక్ట్ గా చెప్పిన మాటేమిటంటే.. కథలోని ఒరిజినల్ కంటెంట్ అనేది అస్సలు మిస్ అవ్వకూడదని, రెగ్యులర్ ఆడియన్స్ కోసమని కామెడీని బలవంతంగా ఇరికించే పని చేయద్దని చరణ్ చెప్పాడని ఈ చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సురేందర్ రెడ్డి ఫస్ట్ హాఫ్ కి సంబందించిన వర్క్ ని ఫినిష్ చేసాడు. ప్రస్తుతం సెకండాఫ్ కి సంబందించిన వర్క్ జరుగుతోంది. ఈ సినిమా జనవరి సెకండాఫ్ లో లాంచ్ అయ్యి ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

