ట్రైలర్ టాక్ : ‘పెద్ది’తో రామ్ చరణ్ తాండవం.. బాక్సాఫీస్ రికార్డులకు బుచ్చిబాబు హెచ్చరిక..!

ట్రైలర్ టాక్ : ‘పెద్ది’తో రామ్ చరణ్ తాండవం.. బాక్సాఫీస్ రికార్డులకు బుచ్చిబాబు హెచ్చరిక..!

Published on May 18, 2026 4:18 PM IST

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ది మోస్ట్ అవైటెడ్ ‘పెద్ది’ ట్రైలర్ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందిన ‘పెద్ది’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ అంచనాలను మరింత పెంచేలా ‘పెద్ది’ ట్రైలర్‌ను కట్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా మలిచారు.

రామ్ చరణ్ తన మాస్ లుక్స్‌తో ట్రైలర్ ఆద్యంతం అభిమానులను థ్రిల్ చేశాడు. ఇక ఈ ట్రైలర్‌లో క్రికెట్, కుస్తీ ఆటల్లో ఆరితేరిన ఆటగాడిగా రామ్ చరణ్ తన విశ్వరూపం చూపించాడు. ఆట కోసం రామ్ చరణ్ చేసే పోరాటమే ఈ సినిమా కథగా బుచ్చిబాబు అత్యద్భుతంగా మలిచిన తీరు మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అటు యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కూడా భారీగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. రామ్ చరణ్ చేసే ఎమోషనల్ జర్నీ, ఆటలో హెవీ యాక్షన్ డోస్‌లతో థియేటర్లలో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టేందుకు రెడీ అయ్యాడు. క్రికెట్, కుస్తీలతో పాటు ఈ సినిమాలో మరో ఆటను కూడా రామ్ చరణ్ ఆడనుండటం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ కలిగించే అంశం.

అందాల భామ జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మల అవుట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తోడవడంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ చేయబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ట్రైలర్‌తో అంచనాలు మరింత పెంచేసిన ‘పెద్ది’ జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు