పంచ కట్టులో కనువిందు చేయనున్న రామ్ చరణ్

Published on Mar 24, 2014 8:30 am IST

ram-charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి వరకూ తను చేసిన సినిమాల్లో కాస్ట్యూమ్స్ పరంగా ఎక్కువగా స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పటి వరకూ అచ్చ తెలుగు సాంప్రదాయబద్దమైన లుక్ లో కనిపించేలా ఒక రోల్ కూడా చేయలేదు.

ఇప్పుడు తన రాబోయే సినిమాలో ఇది మారనుంది. మేము విన్న తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ లో సాంప్రదాయబద్దమైన పంచ కట్టులో కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో శ్రీ కాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కమలిని ముఖర్జీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

రామ్ చరణ్ పంచ కట్టు లుక్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆ కాస్ట్యూమ్ లో రామ్ చరణ్ లుక్ బాగుంటుందా? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలపండి.

సంబంధిత సమాచారం :