వారిని పర్సనల్ గా కలవనున్న రామ్ చరణ్.!

Published on Jun 6, 2021 12:46 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తాను చేస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రాలు “ఆచార్య” మరియు “రౌద్రం రణం రుధిరం” అనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ కూడా కరోనా సెకండ్ వేవ్ మూలాన నిలిచిపోయాయి. అయితే ఈ సెకండ్ వేవ్ మూలాన దేశ వ్యాప్తంగా ప్రజలు అంతా ఎన్ని ఇక్కట్లు పడ్డారో చూసాము.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ప్రాణవాయువు అందక చనిపోవడం చలించి వేసింది.. దీనితో ఈ మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు ముందుకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటకలో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ మరియు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణి అనే మహత్తర కార్యం స్టార్ట్ చేశారు. మరి అలా ఇప్పటి వరకు ఎందరో కరోనా రోగుల ప్రాణాలను ప్రాణ వాయువు అందించిన కాపాడారు.

అయితే ప్రతి జిల్లా స్థాయిలోని ఈ ప్రాణ వాయువును అందించే దిశగా కష్టపడుతున్న మెగా వాలంటీర్స్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ గా కలవనున్నట్టు మెగా వర్గాలు చెబుతున్నాయి. అయితే నిన్ననే చరణ్ తన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞ్యతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇపుడు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ వాలంటీర్లును కలవనుండడం కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనిపై మరింత సమాచారం రానుంది.

సంబంధిత సమాచారం :