బ్రహ్మాజీకి డూప్ గా మారిన రామ్ చరణ్

బ్రహ్మాజీకి డూప్ గా మారిన రామ్ చరణ్

Published on Jul 15, 2015 11:46 AM IST

Ram-charan-Brahmaji
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. యాక్షన్ – కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ప్రతి సినిమాలోనూ హై లెవల్లో కామెడీని పెట్టే శ్రీనువైట్ల ఈ సినిమాలోనూ సూపర్బ్ కామెడీని అందించనున్నాడు. అందుకోసం శ్రీను వైట్ల ఈ సారి బ్రహ్మాజీని ఎంచుకున్నాడు. బ్రహ్మాజీ ఈ సినిమాలో ఓ స్టార్ హీరోగా కనిపించనున్నాడు. హీరో పాత్ర కాబట్టి డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. బ్రహ్మాజీ కనిపించే అన్ని గెటప్స్ లో రామ్ చరణ్ కూడా కనిపిస్తాడు. బ్రహ్మాజీకి డూప్ అయిన స్టంట్ మాస్టర్ గా రంక్ హరన్ కనిపించనున్నాడు.

ఇటీవలే రామ్ చరణ్ – బ్రహ్మాజీలపై వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలను షూట్ చేసారు. రామ్ చరణ్ ఈ మూవీలో స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడని ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమాలో రామ్ చరణ్ ని ఢీ కొట్టనున్న విలన్ పాత్రలో తమిళ స్టార్ అరుణ్ విజయ్ కనిపిస్తాడు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ సిస్టర్ గా కృతి కర్భంద కనిపించనున్న ఈ సినిమాలో నదియా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అక్టోబర్ 15న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు