హీరో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం 2016 డిసెంబర్ లో జీవికే గారి మనవరాలు శ్రియా భూపాల్ తో వైభవంగా జరిగింది. అయితే అంగరంగా వైభవంగా జరగాల్సిన వీరి వివాహం కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నారు. ఇది జరిగిన తరువాత అఖిల్ తన సినిమాలతో బిజీ అయిపోయాడు .
తరువాత శ్రియా భూపాల్ నిశ్చితార్థం అపోలో హాస్పిటల్ చైర్మెన్ ప్రతాప్ సి రెడ్డి మనవడు ఆనిందిత్ రెడ్డితో జరిగింది. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి గ్రాండ్ గా పారిస్ లో జరిగింది . ఈ పెళ్ళికి హీరో రామ్ చరణ్ అతని భార్య ఉపాసన హాజరయ్యారు. ఆనిందిత్ రెడ్డి ఉపాసనకు కజిన్ అవుతాడు. వీరి వివాహందగ్గరి బంధువుల సమక్షంలో జరిగింది.


