మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’(Peddi) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ అవతారంలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘చికిరి చికిరి’ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.
ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్ ఓ భారీ షెడ్యూల్‌ను షూట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ షెడ్యూల్‌లో అదిరిపోయే ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ జిమ్‌లో హెవీ వర్కవుట్స్ చేస్తూ కండలు పెంచుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బీస్ట్ మోడ్‌లో రామ్ చరణ్ ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ చూపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివ రాజ్‌కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.


