తమిళంలో రిలీజ్ కానున్న రామ్ చరణ్ హిట్ సినిమా !
Published on Mar 7, 2018 9:12 am IST

హీరో రామ్ చరణ్ కెరీర్లోని హిట్ సినిమాల్లో ఒకటైన ‘నాయక్’ చిత్రం తమిళంలో డబ్ కానుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేసి పేక్షకుల్ని మెప్పించారు. 2013లో రిలీజైన ఈ సినిమా చరణ్ ను మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసి ఆలయం స్టార్ డమ్ ను పెంచింది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘రౌడీ నాయక్’ పేరుతో తమిళంలోకి అనువదించనున్నారు. డి.నారాయణన్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కాజల్ అగర్వాల్, అమలా పాల్ లు నటించడం ఈ డబ్బింగ్ వెర్షన్ కు కలిసొచ్చే అంశం.

 
Like us on Facebook