రామ్ చరణ్ అకౌంట్ 4 మిలియన్లు దాటేసింది

Published on Jun 21, 2021 9:26 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ ప్రేక్షకుల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అందుకే ఆడియన్స్ ఆయన్ను చాలా త్వరగా స్వీకరించారు. బాక్స్ ఆఫీసు దగ్గరే కాదు సోషల్ మీడియాలో కూడ చరణ్ క్రేజ్ వెలిగిపోతోంది. ఇన్స్టాగ్రమ్ మాధ్యమంలో ఆయన ఫాలోవర్ల సంఖ్య 4 మిలియన్లకి చేరుకుంది. ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో కూడ చరణ్ కు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

చరణ్ తన సినిమాలకు సంబంధించిన విశేషాలనే కాదు ఇతర అంశాలను కూడ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈరోజు నుండే చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. సెకండ్ వేవ్ లాక్ డౌన్ తరవాత చరణ్ సెట్స్ మీదకు రావడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం తరవతా ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చేయనున్నారు. ఇదే కాదు ఇకపై చేసే ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లోనే ఉండేలా చూసుకుంటున్నారు చరణ్.

సంబంధిత సమాచారం :