ఏప్రిల్ 22 నుండి రామ్ చరణ్ బిజీ.!

ఏప్రిల్ 22 నుండి రామ్ చరణ్ బిజీ.!

Published on Apr 12, 2015 12:16 PM IST

Ram-Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్న సంగతి మీకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ఓక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక అబ్రాడ్ లో కొన్ని సాంగ్స్ షూట్ చేయనున్నారు.

ఏప్రిల్ 22 నుంచి రెగ్యులర్ గా షూటింగ్ చేసి దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఫైనలైజ్ కాని ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేయనుంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమా కోసం కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి శ్రీను వైట్ల సినిమా కోసం పనిచేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు