మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 12వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వం లో చేస్తున్నారు . ఈ సినిమాని డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తరువాత చరణ్ ,ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు . ఈ చిత్రాన్ని కూడా దానయ్య నే నిర్మించనున్నాడు .
ఇక ఈ రెండు సినిమాల తరువాత ప్రముఖ బ్యానర్ క్రియేటివ్ కమర్షియల్ సంస్థలో కే ఎస్ రామ రావు నిర్మతగా తన తరువాతి చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్నీ నిన్న రాత్రి జరిగిన తేజ్ ఐ లవ్ యు ఆడియో ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగా స్టార్ చిరంజీవి గారు ప్రకటించారు . అయన మాట్లాడుతూ చరణ్ కు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో నటించాలని వుంది అని తెలిపారు . గతంలో చిరంజీవితో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు కే ఎస్ రామ రావు . తాజాగా ఇప్పుడు సాయి ధరమ్ నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రాన్ని కూడా క్రియేటివ్ కమర్షియల్ సంస్థే నిర్మించింది .


