ఆరచయిత…వర్మను అన్నంతపనీ చేసేలా ఉన్నాడే..!

Published on Dec 4, 2019 10:33 am IST

వర్మ తీసిన లేటెస్ట్ మూవీ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ఆయనకు మరికొంత మంది హేటర్స్ ని తయారు చేసిపెట్టింది. వారిలో సీనియర్ రచయిత జొన్నవిత్తుల ఒకరు. వీరి మధ్య కొన్ని రోజులుగా వార్ నడుస్తుంది. జొన్నవిత్తులను వర్మ… జొన్నవిత్తుల చౌదరి అనగా జొన్నవిత్తుల… వర్మను పప్పు వర్మ అని నామకరణం చేశారు. ఇక జొన్నవిత్తుల వర్మ పైచాచికం, విచ్చలవిడి జీవితంపై ఓ మూవీ చేస్తాను అని ఛాలెంజ్ కూడా చేశారు. ఆయనేదో ఆవేశంలో అన్నారులే అనుకున్నారంతా, ఐతే ఆయన చాలా సీరియస్ గా ఈ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నారని సమాచారం.

ఉత్తర భారతం నుండి వర్మను పోలిన ఓ వ్యక్తిని తీసుకురావడంతో పాటు, అతనికి వర్మ మేనరిజం, నటనలో శిక్షణ కూడా ఇస్తున్నారని వినికిడి. దీనితో అందరి బయోపిక్స్ తీసే వర్మ బయోపిక్ జొన్నవిత్తుల తీసి తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా ఆయనను విమర్శించే వారికి ట్రీట్ ఇవ్వనున్నారు. కాగా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ సెన్సార్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఎలాగైనా మూవీ విడుదల చేస్తానని వర్మ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More