మెగాస్టార్ కి సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

మెగాస్టార్ కి సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

Published on Jan 28, 2015 5:30 PM IST

chiru-ramgopal
టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్నో మరపరాని సినిమాలను, మరపు రాని డాన్సింగ్ స్టెప్స్ ని అందించి అందరిచేత మెగాస్టార్ అనిపించుకున్న హీరో చిరంజీవి. సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్ళిన చిరంజీవి ఆ తర్వాత సినిమా చేయలేదు. గత సంవత్సర కాలంగా మెగాస్టార్ నటించబోయే 150వ సినిమా గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి అలాగే చిరు కూడా తన 150వ సినిమా కోసం కథలు వినడం, అలాగే సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో కచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుంది అనుకుంటున్నా 150వ సినిమా డైరెక్టర్ కోసం చాలా రోజుల నుంచి అన్వేషణ జరుగుతోంది.

తాజాగా రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవిపై ట్విట్టర్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ‘నాకు తెలిసి చిరంజీవి గారు తన 150వ సినిమాని తానె డైరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నాకు ఆయనతో మాట్లాడిన దాన్ని బట్టి అందరి డైరెక్టర్స్ కన్నా ఆయనకీ ఎక్కువ నాలెడ్జ్ ఉంది. అలాగే 150వ సినిమా డైరెక్ట్ చేయగల ఇంటెలిజన్స్ ఆయనకు ఉంది. ఒకవేళ చిరంజీవి గారు తన 150వ సినిమా డైరెక్ట్ చేయలేదంటే, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దానికంటే పెద్ద మిస్టేక్ అవుతుంది. చిరంజీవి గారు తన 150వ సినిమా డైరెక్ట్ చేసాడు అంటే అది బాహుబలి సినిమాతో సమానం అవుతుందని’ వర్మ ట్వీట్ చేసాడు.

తాజా వార్తలు