
యు ట్యూబ్ ప్రపంచం నుంచి జాక్ పాట్ కొట్టి వెండితెరపై హీరోగా పరిచయం అయిన యంగ్ యాక్టర్ రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ ఈ నెల 20వ తేదీన కుమారి 21F అంటూ తన మూడవ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా వంశీ డైరెక్షన్ లో లేడీస్ ట్రైలర్ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే వర్మ డైరెక్షన్ లో ఓ మూకీ సినిమా కూడా చేస్తున్నాడు. తాజాగా ఈ కుర్ర హీరో వర్మ క్రేజీ కామెంట్స్ చేసాడు.
‘వర్మతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. నాకు తెలిసి వర్మ ఓకే ఓకే డైరెక్టర్. నేను అతనికి పెట్టుకున్న ముద్దు పేరు అప్పారావు. నేనే డైరెక్టర్ అయ్యుంటే వర్మ తీసిన శివ, రంగీలా కంటే బెటర్ సినిమాలు తీయగలిగేవాడిని. నేను వర్మతో ఓ సినిమా చేస్తున్నా అతను ఓకే డైరెక్టర్ అని తెలుసు కానీ అతని తప్పుల్ని నేను కరెక్ట్ చెయ్యగలనని’ రాజ్ తరుణ్ గత రాత్రి ట్వీట్స్ చేసాడు. ఇదంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టైంలో వర్మ ఆరాంసే ‘రాజ్ తరుణ్ నాపై వేసిన ట్వీట్స్ ని నేనే సరదాగా అతని అకౌంట్ నుచి వేసాను, అవి సీరియస్ గా తీసుకోవద్దని’ వర్మ ట్వీట్ చేసాడు. దీంతో ఇదోరకం వర్మ పబ్లిసిటీ అని అందరూ పెదవి విరిచారు.

