మరో వివాదాస్పద సినిమాతో ‘వర్మ’ !

Published on Mar 31, 2019 7:17 pm IST

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారికి శశికళకి మధ్య ఉన్న రిలేషన్ ను బేస్ చేసుకుని ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు.

ఇప్పటికే జయలలిత మరణానికి సంబంధించి ఎన్నో వివాదాలు, అనుమానులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వర్మ ఈ అంశాన్నే హైలెట్ చేస్తూ సినిమా తియ్యాలనుకోవడంతో ఈ సినిమా పట్ల అమ్మ అభిమానులతో పాటు తెలుగు తమిళ సినీ పరిశ్రమల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది.

ఇక జయలలిత జీవితం ఆధారంగా ఇప్పటికే లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని దర్శకత్వంలో ‘ది ఐరన్ లేడీ’, అలాగే దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ లాంటి బయోపిక్స్ వస్తోన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈ బయోపిక్స్ కి పోటీగా వర్మ బయోపిక్ కూడా రానుంది.

సంబంధిత సమాచారం :