రామ్ గోపాల్ వర్మకు మళ్లీ ఎదురుదెబ్బ !

రామ్ గోపాల్ వర్మకు మళ్లీ ఎదురుదెబ్బ !

Published on Apr 30, 2019 9:36 PM IST

ఎంతో వివాదాస్పదంగా మారిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పై ఈసీ నిషేధం అమల్లోనే ఉందని, ఆ సినిమా ప్రదర్శనలను ఎక్కడా అనుమతించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 10న దేశంలో రాజకీయ బయోపిక్ లపై ఎన్నికలు ముగిసేంత వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీని పై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష జరిపి, మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఈసీ పేర్కొంది. నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల ప్రతులను ఈసీ తాజాగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు పంపింది.

ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పాటు మరో రెండు సినిమాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. అయితే, తన సినిమా విడుదలకు సహకరించాలంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసీని కోరగా, కుదరదని ఈసీ స్పష్టం చేసింది. ఆ మేరకు వర్మకు సీఈవో ద్వివేది లేఖ కూడా రాశారు. మే1న తన సినిమా రిలీజ్ కోసం పట్టుదలగా ఉన్న వర్మకు ఇది కచ్చితంగా ఎదురుదెబ్బేనని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు