రామ్ మాస్ ప్రాజెక్ట్ మొదలు అప్పుడే..?

Published on Jun 23, 2021 10:05 am IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన లాస్ట్ రెండు చిత్రాలు “ఇస్మార్ట్ శంకర్” మరియు “రెడ్” చిత్రాలతో మాస్ ఆడియెన్స్ కి మరింత దగ్గర అయ్యాడు. దీనితో ఇక నుంచి కూడా సాలిడ్ మాస్ ఎంటర్టైనెర్స్ తో అలరించాలని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ దర్శకుడు లింగుసామి తో చేతులు కలిపాడు.

మరి అనౌన్స్మెంట్ తోనే మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ కాంబో ఎప్పుడు షూట్ ను స్టార్ట్ చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకు ఈ చిత్రం షూట్ కు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తుంది.

వచ్చే జూలై రెండో వారం నుంచి మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా టాక్. ఇక ఈ సాలిడ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో బై లాంగువల్ సినిమాగా తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం :