రాజమండ్రిలో ‘పండగ చేస్కో’ క్లైమాక్స్..

రాజమండ్రిలో ‘పండగ చేస్కో’ క్లైమాక్స్..

Published on Jan 29, 2015 2:00 PM IST

Pandaga-chesko

యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పండగ చేస్కో’. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. రాజమండ్రి దగ్గరలో సామర్లకోట గ్రామంలో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేశారు. ఈ వారంలోనే ఈ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

అమెరికా నుండి ఇండియా వచ్చిన స్టైలిష్ ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నారు. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు