ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. మహేష్ బాబు పి. దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సె, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా టీమ్ హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ.. “చాలా రోజుల తర్వాత నా సినిమాకు ఇంతటి మంచి రివ్యూలు రావడం ఆనందంగా ఉంది. డ్రై సీజన్‌లో రిలీజ్ అయినా మంచి స్పందన వచ్చింది. సినిమాకు రెస్పాన్స్ మరింత పెరుగుతుందని నమ్ముతున్నాం” అన్నారు.
“ఈ సినిమాలో చూపించిన భావోద్వేగం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేసినా, కాస్త సమయం తీసుకుని ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నాం. ఇప్పుడున్న రెస్పాన్స్ చూసిన ఏమీ షాక్ అవడం లేదు.” అని రామ్ కామెంట్ చేశాడు.


