‘ఆంధ్ర కింగ్ తాలూకా’ హీరో నెక్స్ట్ మూవీకి రెడీ..?

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ హీరో నెక్స్ట్ మూవీకి రెడీ..?

Published on Nov 29, 2025 10:59 PM IST

Ram Pothuneni

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

కాగా, ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో రామ్ తన నెక్స్ట్ చిత్రాన్ని స్టార్ట్ చేసే ముందుకు కొంత గ్యాప్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2026 ప్రథమార్థంలో తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రామ్ కిషోర్ అనే కొత్త దర్శకుడితో చేతులు కలుపుతున్నాడట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రొడ్యూస్ చేయనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ 2026 జూన్ చివరినాటికి ముగించుకుని వచ్చే ఏడాది చివరికల్లా సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.

అయితే, ఈ సినిమా తర్వాత యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని రామ్‌కు ఓ కథను వినిపించారట. దీనికి సంబంధించిన చర్చలు సాగుతున్నాయని.. ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతోందట. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రామ్ అభిమానులను అలరించేందుకు రెడీ అవుతుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు