రామ్ పోతినేని “ది వారియర్” టీజర్ రిలీజ్ కి రెడీ!

రామ్ పోతినేని “ది వారియర్” టీజర్ రిలీజ్ కి రెడీ!

Published on May 11, 2022 9:38 PM IST


రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది వారియర్. ఈ చిత్రం లో రామ్ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం టీజర్ కి సంబంధించిన అప్డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం టీజర్ ను మే 14, 2022 సాయంత్రం 5:31 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 14, 2022 న భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు