అసలు సినిమాకే దిక్కు లేదు.. అప్పుడే సీక్వెలా ?

Published on Feb 26, 2019 8:15 pm IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వర్క్ యమా స్పీడ్ గా ఉంటుంది. వారం రోజుల్లో స్క్రిప్ట్ రాసేయడం, నలభై రోజుల్లో సినిమా తీసేయడం పూరి స్టైల్. కాగా ప్రస్తుతం పూరి ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి ‘ఇస్మాట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరూ హీరోయిన్స్ గా నటిస్తోన్నారు.

అయితే ఇప్పటివరకూ వచ్చిన అవుట్ ఫుట్ బాగుండటంతో పూరి ఈ సినిమాకు సీక్వెల్ ను కూడా చేయాలని నిర్ణయించుకున్నారట. ఆ మేరకు ఒక కొత్త టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారు. ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’ అనే టైటిల్‌ ను పూరి రిజిస్ట‌ర్ చేయించాడు. ఇంకా ఇస్మార్ట్ శంక‌ర్‌ నే పూర్తి కాలేదు, రిలీజ్ కాలేదు, అప్పుడే ఆ సినిమాకి సీక్వెల్ ఏంటి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

షూటింగ్ కూడా పూర్తి కాని సినిమాకు సీక్వెల్ చేయాల‌న్న ఆలోచ‌న రావడం నిజంగా విశేషమే. మొత్తానికి ఈ ఆలోచనతో వర్క్ లో పూరి స్పీడ్ ఏంటో తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద కూడా ఈ స్పీడ్ ను పూరి జగన్నాద్ కనబరుస్తారేమో చూడాలి.

ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :