రామ్ -పూరిల ఇస్మార్ట్ శంకర్ ప్రారంభం !

రామ్ -పూరిల ఇస్మార్ట్ శంకర్ ప్రారంభం !

Published on Jan 23, 2019 11:59 AM IST

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ రోజు అధికారికంగా లాంచ్అయ్యింది. రేపటి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఇటీవల ఈచిత్రం యొక్క టైటిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ లను డిజైన్ చేసి సినిమా ఎలా ఉండబోతుందని చిన్న హింట్ కూడా ఇచ్చారు. ఇక దాదాపుగా తన ప్రతి సినిమాతో కొత్త హీరోయిన్ ను పరిచయం చేసే అలవాటు ఉన్న పూరీకి ఈ చిత్రానికి కూడా ఒక కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో వున్నాడట.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. పూరి , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది మే లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు