
శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ హీరోగా ‘శివం శివోహం’ అనే సినిమా తెరకెక్కుతోంది. స్రవంతి రవి కిషోర్ నిర్మాత. సురేందర్ రెడ్డి శిష్యుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ నేటితో కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ పట్ల రామ్ చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజులు ఈ సినిమాకు రామ్ బ్రేక్ ఇవ్వనున్నారు.
ఈ బ్రేక్ టైంలో గత ఏడాదిన్నర నుండి షూటింగ్ జరుపుకుంటున్న ‘పండగ చేస్కో’ ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్ ఈ సినిమాలో హీరోయిన్లు. గోపీచంద్ మలినేని దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్న ‘పండగ చేస్కో’ సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.