ఆ ఫైట్ మాస్టర్ దెబ్బకి రామ్ ఒంటినిండా గాయాలేనట.

ఆ ఫైట్ మాస్టర్ దెబ్బకి రామ్ ఒంటినిండా గాయాలేనట.

Published on Dec 26, 2019 1:32 PM IST

Ram1

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ గా తెరపై ఆటం బాంబులా పేలాడు. పూరి దర్శకత్వంలో రామ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఎట్టకేలకు రామ్ మరియు పూరి లకు ఒక హిట్ కట్టబెట్టింది. ఆ విజయంతో వచ్చిన ఊపులో రామ్ రెడ్ అనే ఓ చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి క్రియేషన్స్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పీటర్ హెయిన్స్ సారధ్యంలో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

కాగా ఈ యాక్షన్ సన్నివేశాల కొరకు పీటర్ హెయిన్స్ రామ్ ని ఒక రేంజ్ లో కష్టపెడుతున్నారట. ఈ విషయాన్ని రామ్ ఒక వీడియో చేసి మరీ చెప్పారు. తనకు తగిలిన గాయాలను చూపిస్తూ పీటర్ హెయిన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. రామ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ మొదటి సారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తుండగా సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు