తన ప్రాజెక్ట్ పై సూపర్ ఎగ్జైట్ అవుతున్న రామ్.!

Published on Jun 24, 2021 3:02 pm IST

మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఇటీవలే ప్రముఖ దర్శకుడు ఎన్ లింగసామితో ఓ సాలిడ్ మాస్ మసాలా చిత్రం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మాస్ లో తన లాస్ట్ రెండు సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రామ్ ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో తన ఎగ్జైట్మెంట్ ను తెలుపుతున్నాడు.

మరి తాను చెప్పిన దాని ప్రకారం వీరి కాంబోలో సినిమా ఫైనల్ నరేషన్ ను లింగుసామి వినిపించారని అది విన్నాక సూపర్ డూపర్ కిక్ వచ్చింది అని అలాగే రోల్ దట్ కెమెరా అంటూ షూటింగ్ కోసం ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో తెలిపాడు. మరి ఈ చిత్రం తాలూకా షూట్ కూడా వచ్చే నెలలో మొదలు కానుంది అని తెలిసిందే. మరి మొత్తానికి ఈ మాస్ బై లాంగువల్ చిత్రం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ను అందివ్వనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :