రామ్ -పూరి మూవీ డీటైల్స్ !

Published on Dec 25, 2018 11:20 am IST

గత కొంత కాలంగా సరైన విజయాలు లేక బాగా వెనకపడిపోయారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . ఇటీవల తన కొడుకుతో ‘మెహబూబా’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన ఫలితం లో ఎలాంటి మార్పు రాలేదు. ఇకఈ సినిమా తరువాత చాల గ్యాప్ తీసుకొని పూరి మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకురెడీ అవుతున్నాడు .

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో పూరి ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ఈచిత్రాన్ని కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. రామ్ ప్రస్తుతం ఈసినిమా కోసం న్యూ లుక్ ను ట్రై చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి లో సెట్స్ మీదకు వెళ్లి అదే ఏడాది మేలో విడుదలకానుంది. ఈచిత్రాన్ని పూరి టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్, చార్మి కలిసి నిర్మించనున్నారు. తర్వలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగితా నటీనటులను ,సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు.

ఇక ఇటీవల ‘హలో గురు ప్రేమ కోసమే’ తో ప్రేక్షకులముందుకు వచ్సిన రామ్ ఆ చిత్రంతో హిట్ కొట్టాడు. అయితే ‘రెడీ’ లాంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రామ్ ఆ లోటును తీర్చుకునేందుకు ఈసారి పూరి కి ఛాన్స్ ఇచ్చాడు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :