‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ హిట్ కొట్టిన రామ్ అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇకపై ఎలాంటి సినిమాలు చేయాలో ఫిక్స్ అయిన ఆయన కొన్ని కథల్ని కూడా చూజ్ చేసి పెట్టుకున్నారట. అయితే తన తర్వాతి చిత్రంగా మాత్రం తమిళ చిత్రం ‘తడం’ను రీమేక్ చేయాలనుకుంటున్నట్టు టాక్. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.
అంతేకాదు తన కెరీర్ గ్రాఫ్ మార్చిన పూరితో ఇంకో సినిమా చేయాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాడు ఈ ఎనర్జిటిక్ హీరో. ఆ చిత్రానికి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే పేరు కూడా రిజిస్టర్ చేయించారు. లోపల ఇన్ని చేస్తున్న రామ్ అభిమానులకు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ రామ్ నుండి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి కోసమే దీపావళి సందర్బంగా ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఏదో న్యూస్ చెప్పబోతున్నాడట. అది ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించే అయ్యుండాలి. మరి అదేమిటో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.


