రణ్‌బీర్ కపూర్ హీరోగా నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణం’ చిత్రం ఏకంగా 10,000 మందికి పైగా క్రూ తో ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG మరియు యష్‌కి చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. పార్ట్-1 2026 దీపావళికి, పార్ట్-2 2027 దీపావళికి విడుదల కానున్నాయి.
హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విదేశీ నిపుణులు, సరికొత్త టెక్నాలజీ, భారీ సెట్స్‌తో ఇండియా మరియు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా, పక్కా రీసెర్చ్‌తో విజువల్ వండర్‌గా ఈ మైథలాజికల్ ఎపిక్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ యష్ రావణాసురుడి పాత్ర పోషిస్తూనే ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.


