ఈ ఏడాది బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రమే ‘రామాయణ పార్ట్ 1’. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి, యష్ లాంటి బిగ్ స్టార్స్ కలయికలో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ భారీ విజువల్ అండ్ ఎమోషనల్ డ్రామా విడుదల అయ్యి బాలీవుడ్ హిస్టరీలో రికార్డు వసూళ్లు అందుకుంటుంది.
అయితే బాలీవుడ్ మార్కెట్ మన తెలుగులో కూడా మెల్లగా పుంజుకుంటూ వస్తుంది. ఇది వరకు బాలీవుడ్ నుంచి వచ్చిన పలు సినిమాలు తెలుగు వెర్షన్ లో బాగానే వసూళ్లు రాబట్టాయి. అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ సినిమా వార్ 2 మొత్తం వసూళ్ళని రామాయణం పార్ట్ 1 క్రాస్ చేసినట్టు ఇప్పుడు తెలుస్తుంది.
వార్ 2 సినిమా 56.7 కోట్ల గ్రాస్ ని తెలుగు వెర్షన్ లో రాబడితే ఈ లైఫ్ టైం వసూళ్ళని రామాయణం 19 రోజుల్లో క్రాస్ చేసినట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో రామాయణ తెలుగు వెర్షన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందించగా నమిత్ మల్హోత్రా నిర్మాణం వహించారు.


