‘హ్యాపీవెడ్డింగ్’ కు ముఖ్య అతిధిగా రానున్న రామ్ చరణ్ !

‘హ్యాపీవెడ్డింగ్’ కు ముఖ్య అతిధిగా రానున్న రామ్ చరణ్ !

Published on Jul 20, 2018 4:00 PM IST

happy7

యువ హీరో సుమంత్ అశ్విన్ , మెగా డాటర్ నిహారిక జంటగా నూతన దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లో జరుగనుంది. ఈవేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ హీరో నిహారిక అన్నయ్య రామ్ చరణ్ హాజరుకానున్నారు.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ‘ఫిదా’ ఫెమ్ శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో పాకెట్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 27న ప్రేక్షకులముందుకు రానుంది.

తాజా వార్తలు