తమ్ముడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్న అన్న !

Published on Dec 16, 2018 10:19 am IST

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పెస్ థ్రిల్లర్ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రానున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. డిసెంబర్ 18న ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుంది. తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ థ్రిల్లర్ కావడంతో ఈ చిత్రం ఫై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైనెంట్ పతాకం ఫై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లో లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటించారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :