రామ్ ‘హరికథ’ టైటిల్ మారనుందా??

రామ్ ‘హరికథ’ టైటిల్ మారనుందా??

Published on Nov 11, 2015 10:25 AM IST

ram
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో హరికథ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే శివమ్ సినిమాతో మంచి హిట్ వస్తుందని ఆశించిన రామ్‌కు ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో ప్రస్తుతం రామ్ తన పూర్తి శ్రద్ధను హరికథపై ఉంచారు. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో రానున్న ఈ సినిమాలో రామ్ ఎనర్జీకి సరిపడే యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు లవ్, కామెడీ అంశాలకు పెద్ద పీట వేశారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికర కథనం ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాకు హరికథ అనే టైటిల్‌కు బదులు ‘నేను-శైలజ’ అనే పేరును పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకూ హరికథ పేరే బాగా ప్రచారంలో ఉన్నా కథ రీత్యా నేను-శైలజ పేరే సరైనదని రామ్ భావిస్తున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను డిసెంబర్ నెలలో, సినిమాను కొత్త సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

తాజా వార్తలు