రామ్ ‘నేను శైలజ’ మూవీ రిలీజ్ డేట్

రామ్ ‘నేను శైలజ’ మూవీ రిలీజ్ డేట్

Published on Dec 6, 2015 11:03 AM IST

nenu-sailaja
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన నెక్స్ట్ మూవీకి ‘నేను శైలజ’ అన్ టైటిల్ని ఫిక్స్ చేసారని ఇది వరకే తెలియజేశాం. ఈ మూవీలో రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ తో రానున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దాంతో ఈ చిత్ర టీం నిన్న ‘నేను శైలజ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఆ ఫస్ట్ లుక్ చూడగానే ఈ సారి రామ్ మంచి ఫీల్ గుడ్ స్టొరీ తో రానున్నాడు అనే కామెంట్స్ తో పాటు, సూపర్ కూల్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దాంతో ఈ చిత్ర టీం అదుఇఒ రిలీజ్ డేట్ మరియు మూవీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఆడియో కోసం డిసెంబర్ 12వ తేదీని ఫిక్స్ చేయగా, రిలీజ్ కోసం మేము ముందుగా చెప్పినట్టుగానే 2016 జనవరి 1ని ఫిక్స్ చేసారు. రామ్ ఈ సినిమాలో నైట్ క్లబ్ లో పనిచేసే ఓ డిజేగా కనిపించనున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి స్రవంతి రవికిషోర్ నిర్మాత. రవికిషోర్ రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానీ ఈ చిత్ర పూర్తి కథని సిద్దం చేసినట్లు ఈ చిత్ర టీం తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు