రామ్ కొత్త సినిమా షూటింగ్ మొదలు !

రామ్ హీరోగా త్రినాద్ దర్శకత్వంలో సెట్టైన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమయ్యింది. రామ్, ప్రకాష్ రాజ్ ఈరోజు చిత్ర షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మేఘ ఆకాష్ నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రసన్న కుమార్ మాటలు రాస్తున్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ త్రినాద్ గతంలో దర్శకత్వం వహించిన ‘సినిమా చూపిస్తా మావా, నేను లోకల్’ తరహాలో కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని సమాచారం. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Exit mobile version