రమ్యకృష్ణ శైలజారెడ్డిగారింట్లో అడుగు పెట్టారు !

రమ్యకృష్ణ శైలజారెడ్డిగారింట్లో అడుగు పెట్టారు !

Published on Jun 21, 2018 3:51 AM IST


మారుతి దర్శకత్వంలో నాగచైతన్య అనూ ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. టైటిల్లో లాగానే చిత్రంలో కూడా ఆత్త పాత్రే చాలా కీలకం అని తెలుస్తోంది, అందుకే అత్త పాత్రకు పూర్తి న్యాయం చేయగల నటి అయిన రమ్యకృష్ణను తీసుకున్నారు. ‘శైలజారెడ్డి అల్లుడు’ షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్న, రమ్యకృష్ణ మాత్రం ఇంతవరకు షూట్ లో పాల్గొనలేదు.
తాజా సమాచారం ప్రకారం రమ్యకృష్ణ ఈ రోజే చిత్రబృందంతో జాయిన్ అయ్యారట.

రామోజీ ఫిల్మ్ సిటీలో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా కోసం ప్రత్యేకంగా సినిమాలో శైలజారెడ్డి హౌస్ సెట్ వేశారు. అంటే రమ్యకృష్ణ శైలజారెడ్డిగారింట్లో అడుగు పెట్టారు. ఇంచుమించుగా ఇరవై రోజుల దాకా రమ్యకృష్ణ షూటింగ్ పాల్గొంటారని సమాచారం. జూలై చివర్లోకల్లా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి, ఆగస్టు ఆఖరి వారంలో ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు