మహేష్ 26లో మరో సీనియర్ నటి ?

Published on Apr 28, 2019 9:54 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. వచ్చే నెల లో ఈ చిత్రం లాంచ్ అయ్యి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన రోజుకో వార్త బయటికి వస్తుంది. ఇటీవల సీనియర్ నటి విజయశాంతి ఈచిత్రంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనునుందని వార్తలు రాగ నిన్న ఈచిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా ఈచిత్రానికి సంబందించిన క్యాస్టింగ్ గురించి మరో వార్త ప్రచారం లో వుంది. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనుందట. త్వరలోనే రమ్యకృష్ణ ను కలిసి స్టోరీ నరేట్ చేయనున్నాడట అనిల్.

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :