అమితాబ్ కు జోడీగా సీనియర్ నటి !

Published on Apr 2, 2019 3:45 pm IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల ‘ఊరియంద మణిధన్’ అనే తమిళ సినిమాకు సైన్ చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ లో ఎస్ జె సూర్య , అమితాబ్ పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ కు జోడిగా సౌత్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ను తీసుకోనున్నారట.

తమిళవన్నన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక స్క్రిప్ట్ నచ్చడంతో ఈసినిమా కోసం అమితాబ్ 40 రోజులు తన డేట్స్ ను కేటాయించారట.

సంబంధిత సమాచారం :