నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న రానా!

Published on Aug 10, 2021 9:40 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుపాటి ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ తో తాజాగా ఈ డీల్ ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. రానా మరియు వెంకటేష్ లు ఇద్దరూ కలిసి ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.

రానా చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం నెట్ ఫ్లిక్స్ తో ఒక వెబ్ సిరీస్ చేయనున్నారు. ఇందులో వెంకటేష్ మరియు రానా లు కూడా నటించడం జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ కోసం కొత్త దర్శకుని వేటలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది చివరలో ఇందుకు సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :