బ్యాక్ టు ఇండియా అంటున్న రానా

బ్యాక్ టు ఇండియా అంటున్న రానా

Published on Oct 6, 2019 9:34 AM IST

rana

దగ్గుబాటి రానా నేడు ఉదయాన్నే ట్విట్టర్ ద్వారా తన ఫ్యాన్స్ మరియు శ్రేయోభిలాషులను పలకరించారు. మదర్ ల్యాండ్ నుండి హాయ్…,అని చెప్పిన ఆయన చాలా రోజుల తరువాత ఇండియాకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దగ్గుబాటి రానా దాదాపు రెండు నెలలుగా అమెరికాలో ఉంటున్నారు. తను భవిష్యత్ లో చేయనున్న చిత్రాలలో పాత్రల లుక్స్, అప్పీరెన్స్ వంటి విషయాల కొరకు ఆయన ఇన్నాళ్ల నుండి అక్కడవుంటున్నారు. చాలా కాలం తరువాత ఆయన ఇండియా రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇక రానా తెలుగు,తమిళ హిందీ భాషలలో కలిపి అరడజనుకు పైగా చిత్రాలలో నటిస్తున్నారు. తెలుగులో ఆయన నటిస్తున్న విరాట పర్వం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో రానా సరసన సాయిపల్లవి నటిస్తుంది. ఇక హిందీలో ఆయన అక్షయ్ కుమార్ తో చేసిన హౌస్ ఫుల్ 4 త్వరలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు