బాలీవుడ్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘కేసరి చాప్టర్ 2’ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో ‘కేసరి’ అనే చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే టైటిల్‌తో రెండో భాగంగా వస్తున్న ఈ సినిమాపై కూడా బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ‘జలియన్‌వాలా బాగ్’ ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా ఓ సీరియస్ కోర్ట్ రూం డ్రామాగా తెరకెక్కింది.
అయితే, ఈ సినిమాపై తొలి రివ్యూ ఇచ్చాడు టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి. ఆయన తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించానని.. హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ మూవీ అద్భుతంగా ఉందని.. ఇలాంటి చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని.. తమ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు కృషి చేస్తామని.. రానా దగ్గుబాటి చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాను అందరూ తప్పక చూడాలని.. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారని రానా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Just watched an incredible historical courtroom drama — Kesari Chapter 2: The Untold Story of Jallianwala Bagh.
A powerful, important film that stands tall and stays deep with the Indian in you.This is storytelling that deserves to be seen across languages.
We @SureshProdns… pic.twitter.com/Kxj5CHqNjL— Rana Daggubati (@RanaDaggubati) April 12, 2025


