‘ఎన్టీఆర్’కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ‘రానా’ !

Published on Mar 28, 2019 8:45 pm IST

జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితులు, స్నేహితులు టాలీవుడ్ చాలామందే ఉన్నారు. రఘు, రాఘవ లాంటి కమెడియన్స్ దగ్గర నుంచి రామ్ చరణ్, రానా లాంటి స్టార్ హీరోల వరకు తారక్ కి బాగా క్లోజ్. అయితే తాజాగా తారక్ కి ఓ హీరో నుంచి అదిరిపోయే గిఫ్ట్ అందింది.

వివరాల్లోకి వెళ్తే.. రానా దగ్గుబాటి అమరచిత్రకథ అనే పుస్తకాల సిరీస్ ను తారక్‌ కు గిఫ్ట్ గా పంపించాడు. ఇంతకీ ఈ అమరచిత్రకథ బుక్స్ సిరీస్ లో పురాణాలు దగ్గర నుంచి చరిత్రలోని గొప్పవ్యక్తుల జీవితాలతో పాటు, జానపద కథలు, వీరగాథలు లాంటి వీరోచిత కథలు కూడా ఉంటాయి. అయితే ఇవ్వన్నీ కామిక్స్ రూపంలో ఉండటం విశేషం.

కాగా అమరచిత్రకథ పుస్తకాల సిరీస్ ను అందుకున్న తారక్‌ దీని పై తన స్పందనను ట్వీటర్ లో పోస్ట్ చేస్తూ.. ‘చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి, ఈ కామిక్ అమరచిత్రకథ పుస్తకాల ఇచ్చినందుకు థ్యాంక్స్ రానా.. వీటి వల్లన నా బాల్యాన్ని అభయ్ తో పంచుకోవడానికి అవకాశం దొరికింది’ అంటూ తారక్ పోస్ట్ చేసారు.

సంబంధిత సమాచారం :