ప్రభాస్ సినిమాలో ‘రానా ‘ ప్రత్యేక పాత్ర ?

ప్రభాస్ సినిమాలో ‘రానా ‘ ప్రత్యేక పాత్ర ?

Published on Jun 29, 2020 10:05 AM IST

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో రానా ప్రత్యేక పాత్రలో రెండు నిముషాల పాటు కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాకి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుతున్న టీమ్ కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు.

కాగా మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను జూలై సెకెండ్ వీక్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు. దానికి సంబంధించిన సెట్ నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టారట. మిగిలిన షూటింగ్ మొత్తం దాదాపు ఫిల్మ్ సిటీలోనే తీస్తారట. ఈ లాక్ డౌన్ సమయంలో కూడా టైమ్ సేవ్ చెయ్యడం కోసం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చేస్తోంది.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు