పెళ్ళికొడుకు సంబరం మాములుగా లేదే..!

Published on Aug 8, 2020 12:26 pm IST

మరికొద్ది గంటల్లో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల వివాహం జరగనుంది. తన ప్రేయసి మిహికా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేయనున్నారు రానా. రామానాయుడి స్టూడియోలో బయో సెక్యూర్ వాతావరణంలో రానా, మిహికాల పెళ్లి వేడుక జరగబోతుంది. కొత్త పెళ్లి కొడుకు రానా సంబరం మాములుగా లేదని అర్థం అవుతుంది. నేడు ఆయన ఓ ఫోటోషేర్ చేశారు. ‘వరుడిగా సాంప్రదాయ బట్టల్లో రానా తన తండ్రి సురేష్ బాబు, బాబాయి వెంకటేష్‌తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ, పెళ్లికి రెడీ అని కామెంట్ పెట్టాడు. రానా, వెంకటేష్ మరియు సురేష్ బాబులతో కూడిన ఆ ఫోటో ఆసక్తిరేపుతుంది.

ఇక ఈ వివాహానికి కేవలం కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారని సమాచారం. ఐతే వర్చువల్ రియాలిటీ సెట్స్ ద్వారా పెళ్ళికి హాజరుకాని బంధువులు సన్నిహితులు పెళ్లిని ఆస్వాదించవచ్చు. సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే టాలీవుడ్ నుండి బాలీవుడ్ ప్రముఖుల వరకు ఈ పెళ్ళికి హాజరై సందడి చేసేవారు. ఏది ఏమైనా రానా వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

సంబంధిత సమాచారం :

More