వెంకీమామ లో అతిధి పాత్రలో రానా ?

Published on Jan 30, 2019 1:44 pm IST

విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య కలిసి నటించనున్న మల్టీ స్టారర్ ‘వెంకీమామ’ ఫిబ్రవరి 21నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈచిత్రంలో రానా దగ్గుబాటి అతిధి పాత్రలో నటించనున్నాడని ప్రచారం జరుగుతుంది. అందుకోసం సినిమాలో రానా కు ఒక చిన్న పాత్ర ను కూడా సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రానా బాబాయ్ తో నటించాలని ఉందని చాలా సార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. మరి రానా కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుందో లేదో చూడాలి.

‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా శ్రీయ అలాగే చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నఈచిత్రం దసరా సీజన్ లో విడుదలకానుంది.

ఇక ఇటీవల ఎఫ్ 2 అనే మల్టీ స్టారర్ తో సాలిడ్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన వెంకీ ఈ వెంకీమామ తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More